మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వాసుదేవన్
Last Updated : బుధవారం, 22 మే 2019 (16:11 IST)

పవన్ కల్యాణ్ కొంపముంచనున్న ఆ రెండు తప్పులు?

ఎన్నికలు ముగిసి కౌంటింగ్‌కు రంగం సిద్ధమవుతున్న వేళ... జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తూ... ఆయన రెండు తప్పులు చేసారనీ, ఆ రెండు తప్పులే ఆయన కొంప ముంచబోతున్నాయని విశ్లేషిస్తున్నారు సినీ రచయిత, నిర్మాత కోన వెంకట్. 
 
వివరాలలోకి వెళ్తే... పవన్ కళ్యాణ్ తన పార్టీ నేతలు కొందరు చెప్పిన తప్పుడు సలహాలు విని, తెరాసతో వైకాపాకి సంబంధాలను అంటగట్టడం ఆయన చేసిన మొదటి తప్పనీ... అసలు ఆంధ్ర ఎన్నికల్లో తెరాస పాత్ర ఎంతమాత్రమూ లేదనే విషయాన్ని పవన్ మరిచారని అన్నారు.
 
ఇక, ఆయన చేసిన రెండో తప్పుగా మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడాన్ని ప్రస్తావించిన వెంకట్... క్లీన్ పాలిటిక్స్ అని చెప్పుకొని తిరిగే పవన్ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి వచ్చిన మాయావతితో పొత్తు ఏమిటని ప్రశ్నిస్తూ, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని మరో పెద్ద తప్పు చేసారని అన్నారు.