మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (14:17 IST)

చంద్రబాబు ఆస్తులు ఎంతో తెలుసుకోవడానికి మీరెవరు?: లక్ష్మీపార్వతికి సుప్రీం సూటి ప్రశ్న

lakshmi parvathi
తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఆస్తులు ఎంతో విచారణ జరపాలంటూ వైసిపి నాయకురాలు సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ.. ఓ వ్యక్తి ఆస్తులు గురించి తెలుసుకునేందుకు మీరు ఎవరు అంటూ ప్రశ్నించింది.

 
లక్ష్మీపార్వతి పిటీషన్ ను గతంలో హైకోర్టు కొట్టివేసిన సంగతిని గుర్తుచేస్తూ... అన్నివిధాలా ఆలోచన చేసే హైకోర్టు ఆ పిటీషన్ కొట్టివేసిందని తెలిపింది. చంద్రబాబు నాయుడు ఆస్తులపై విచారణ జరపాలంటూ లక్ష్మీపార్వతి లేవనెత్తిన అంశానికి ఎలాంటి విలువ లేదని ఆమె దాఖలు చేసిన పిటీషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది.