ఉగాది నుంచి విశాఖ కేంద్రం సీఎం జగన్ పాలన?
ఏపీకి మూడు రాజధానుల విషయంలో పట్టుదలతో వున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం కీలక నిర్ణయం తీసుకున్నారు. రానున్న ఉగాది నుంచి విశాఖ కేంద్రంగా ముఖ్యమంత్రి పాలన ప్రారంభిచాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూడు రాజధానుల వ్యవహారం సుప్రీం కోర్టు పరిధిలో వుంది.
ఏపీ హైకోర్టు అమరావతి రాజధానిగా కొనసాగించాలని ఆదేశించటంతో ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పు పైన సుప్రీంలో ఎస్ఎస్ఎల్పీ దాఖలు చేసింది. దీని పైన సుప్రీం ధర్మాసనం విచారణ కొనసాగిస్తోంది.
ఒకవైపు న్యాయ పోరాటం సాగిస్తూనే.. విశాఖ కేంద్రంగా సీఎం ముందుకు కదులుతున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను ఏపీలో విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.