young man: లవర్ వదిలేసిందని ఓ యువకుడు ఆత్మహత్య
లవర్ వదిలేసిందని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. వాలివేటి హితేష్ (29) అనే వ్యక్తి ఒక ప్రైవేట్ కంపెనీలో ప్రోగ్రాం మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఓ ప్రియురాలు కూడా ఉంది. అయితే కొద్ది రోజుల నుంచి వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి.
పలు కారణాల వల్ల గొడవలు జరిగాయి. దీంతో ఈ మధ్యే హితేష్‌కు యువతితో బ్రేకప్ అయింది. దీంతో లవర్ వదిలేయడంతో హితేష్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఆ యువతితో కలిసి ఉన్న రోజులను గుర్తు చేసుకుంటూ కుంగిపోయాడు.
ఆమె మళ్లీ తన జీవితంలోకి తిరిగి రాదని భావించి తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. దీంతో హైదరాబాద్ రాయదుర్గంలోని ల్యాంకో హిల్స్ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న హితేష్.. ఫ్యాన్‌కు ఉరేసుకుని చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.