బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 నవంబరు 2024 (17:00 IST)

అసెంబ్లీకి ధైర్యంగా వెళ్లలేని వారికి పదవులు ఎందుకు: వైఎస్ షర్మిల

Sharmila
తనకు మైక్ ఇవ్వరని, అందువల్ల తాను అసెంబ్లీ సమావేశాలకు వెళ్లనంటూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ చీఫ్, జగన్ సోదరి వైఎస్ షర్మిల తనదైనశైలిలో కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీకి వెళ్లేందుకు ధైర్యంలేనివారికి పదవులు ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. జగన్ అయినా.. వైకాపా అయినా ఎమ్మెల్యేలైనా రాజీనామా చేయాల్సిందేనని చెప్పారు. 
 
ఈ నెల 11వ తేదీన ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదని జగన్ ప్రకటించిన విషయం తెల్సిందే. దీనిపై ఆమె స్పందిస్తూ, అసంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతో పదవుల్లో ఉండటం ఎందుకని ప్రశ్నించారు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీకి వెళ్లి ఏం మాట్లాడగం అని జగన్ మాట్లాడిన విషయం తెల్సిందే. అసెంబ్లీకి వెళ్లకపోయినా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీడియా సమావేశాల ద్వారా ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు. ఈ విషయంలో జగన్ తీరును తీవ్రంగా పరిగణించారు.