శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: ఆదివారం, 2 డిశెంబరు 2018 (20:13 IST)

బాలయ్యకు పౌరుషం లేదు... పనికిరాని గన్నేరు పప్పు లోకేష్... రోజా సెటైర్లు

ఏపీ సీఎం చంద్రబాబు తాను చేసిన తప్పులను మరచి పోయి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు రోజా. తెలంగాణలో పార్టీ మారిన శాసనసభ్యులు చిత్తుచిత్తుగా ఓడించమని చెబుతున్నారు.. అదే మాట ఆంధ్రాలో వర్తించదా.. పొత్తుల కోసం చంద్రబాబు పరితపిస్తున్నారు. హరికృష్ణ శవాన్ని అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ పొత్తు కోసం ప్రయత్నించారు చంద్రబాబు. కోడెల శివప్రసాదరావు లాంటి దిగజారిన స్పీకర్  దేశంలో లేరు.
 
రాజ్యాన్ని పరిరక్షించ వలసిన స్పీకర్ ప్రతిపక్షాన్ని ఇబ్బందులు పెడుతుంటే పవన్‌కు కనపడలేదా. కోడెల వియ్యంకుడు ఇంటిలోనే పవన్ జనసేన ఆఫీస్ ఉంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు‌.
 
బాలయ్య మరచిపోయి ప్రచారంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. బాలయ్యకు ఎన్టీఆర్ పౌరషం లేదు. నందమూరి కుటుంబాన్ని రాజకీయాల నుంచి తప్పించడానికి సుహాసినికి సీటిచ్చారు. ఓటుకి నోటు కేసులో దొరికిన దొంగను వదిలేస్తే చంద్రబాబు ఎంతకు తెగించారో కేసీఆర్ తెలుసుకోవాలి. తెలంగాణా ప్రచారం చేస్తున్న చంద్రబాబును సీమాంధ్ర ప్రజలు అడ్డుకోవాలి. రెండు రాష్ట్రాలలో పనికిరాని గన్నేరు పప్పు లోకేష్ అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు రోజా.