శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (09:10 IST)

పవన్‌కు అలీ పంచ్.. నా కష్టంతో పైకొచ్చా.. చిరంజీవి వేసిన బాటలో పవన్ వచ్చారు...

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు సినీ నటుడు, వైకాపా నేత అలీ పంచ్ వేశారు. అలీ కష్టాల్లో ఉన్నపుడు అన్ని విధాలుగా ఆదుకున్నామనీ అలాంటి వ్యక్తులు నమ్మించి మోసం చేశారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు అలీ కౌంటర్ ఇచ్చారు. 
 
ఇదే అంశంపై అలీ స్పందిస్తూ, తాను ఈ ఎన్నికల ప్రచారంలో పవన్‌ కల్యాణ్, లేదా ఆయన పార్టీ గురించి ఎక్కడా మాట్లాడలేదన్నారు. అయినా ఆయన తననుద్దేశించి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. పవన్‌ కళ్యాణ్, తన అన్న చిరంజీవి వేసిన బాటలోపైకి వచ్చారని, కానీ తాను అలా కాదని తన కష్టంతోనే సినీ పరిశ్రమలో పైకొచ్చానన్నారు. తనకేదో ఆయన సాయపడినట్లుగా చెప్పుకున్నారని, అందులో ఏమాత్రం నిజం లేదన్నారు. పవన్‌ సినీరంగంలోకి అడుగు పెట్టే నాటికే తాను పరిశ్రమలో ఒక స్థానం సంపాదించుకున్నానని గుర్తుచేశారు.
 
పైగా, 'ఏ రకంగా పవన్‌ నాకు సాయపడ్డారు. ఏమైనా సినిమాలు లేకుంటే  ఇప్పించారా? కష్టాల్లో ఉంటే ఆదుకున్నారా? లేక ఇంకేమైనా సాయం చేశారా?' అని అలీ ప్రశ్నించారు. పవన్‌ కళ్యాణ్‌ పార్టీ పెట్టినపుడు తాను ఆయన కార్యాలయానికి వెళ్లి ఖురాన్‌ ప్రతిని, ఖర్జూరాలను ఇచ్చి అభినందించి వచ్చానన్నారు. 'నేను వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరకూడదా? అదేమైనా తప్పా? రాజ్యాంగ విరుద్ధమా?' అని అలీ నిలదీశారు.