బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (11:12 IST)

గోపాలపురంలో చంద్రబాబు: చేతుల్లో కర్పూరం వెలిగించుకుని హారతి ఇచ్చిన అభిమాని(Video)

Aarti to Chandrababu
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏపీని అభివృద్ధిలో అట్టడుగు స్థానంలోకి నెట్టిన వైసిపి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించివేయాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఓ అభిమాని తన చేతుల్లో కర్పూరం వేసుకుని చంద్రబాబు నాయుడికి హారతి ఇచ్చారు.
 
అంతకుముందు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... ఏ నెలకి ఆ నెల అప్పు తెచ్చుకుంటేనే కానీ జీతాలు ఇవ్వలేడు, పింఛన్లు ఇవ్వలేడు ఈ అప్పుల జగ్గడు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంపద సృష్టిస్తాం. ఆ సంపదను ప్రజలకు పంచుతాం. అది మాతోనే సాధ్యం. రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తే నెలకు రూ.4000 పింఛన్‌ని ఇంటి దగ్గరకే తెచ్చి ఇచ్చే ఏర్పాటు చేస్తాం. అంతేకాదు... జగన్ ప్రభుత్వం పింఛన్లు ఇవ్వకుండా ఎవరినైనా ఇబ్బంది పెడితే, వారికి ఇప్పటి నుంచే రూ.4000 చొప్పున పింఛన్ ఇస్తాం.
 
ప్రజలకు, రాష్ట్రానికి ఏదైనా మంచి చేస్తే అది చెప్పుకుని ఓట్లు అడగాలి. దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు మంచి చేయడం అన్నది జగన్ రెడ్డి చరిత్రలో లేదు. అందుకే ఎన్నికలు అనగానే శవ రాజకీయం మొదలుపెడతాడు ఈ దుర్మార్గుడు." అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.