1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , గురువారం, 16 సెప్టెంబరు 2021 (13:03 IST)

హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ను కాపాడిన 108 సిబ్బందికి స‌న్మానం

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అయినపుడు స‌త్వరం స్పందించి వ‌చ్చిన 108 స‌ర్వీస్ కు ఆయ‌న అభిమానులు కృత‌జ్న‌త‌లు తెలిపారు. 108 సిబ్బంది ఎమర్జెన్సీగా వచ్చి వెంటనే స్పందించి, తేజ్ ను తీసుకుని తక్కువ సమయంలో హాస్పిటల్ లో చేర్పించినందుకు అభినందన‌లు తెలిపారు. 
 
హైద‌రాబాదులోని 108 అంబులెన్స్ డ్రైవర్  శివ‌, అంబులెన్స్ టెక్నీషియన్ ఎస్. మారుతీ ప్రసాద్ చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ లో చిరు సత్కారం చేశారు.  అఖిల భారత చిరంజీవి యువత ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. వినియ‌క‌చ‌వితి నాడు సాయి ధ‌ర‌మ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ పై హైద‌రాబాదులో వేగంగా ప్ర‌యాణిస్తూ, బండి స్కిడ్ అయి, న‌డి రోడ్డ‌పై జారి ప‌డిపోయారు. ఆయ‌న ధ‌రించిన హెల్మెట్ కూడా ఎగిరి దూరంగా ప‌డిపోయింది. తీవ్రంగా గాయ‌ప‌డి అప‌స్మార‌క స్థితిలో ఉన్న హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ని 108 వాహ‌నం ఆసుప‌త్రికి త‌ర‌లించింది. 
 
ఆ స‌మ‌యంలో రోడ్డుపై ఉన్న వారు ఎవ‌రో 108 కి కాల్ చేయ‌డంతో ఎమ‌ర్జ‌న్సీ వాహ‌నం వెంట‌నే వ‌చ్చింది. అందులోని సిబ్బంది హీరో తేజ్ ను ఆఘ‌మేఘాల‌పైన ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ వెంట‌నే చికిత్స అందించ‌డంతో గాయ‌ప‌డిన తేజ్ ప్రాణాపాయ స్థితి నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. ఆయ‌న ఇపుడు ఆసుప‌త్రిలో కోలుకుంటున్నారు.