పిఠాపురంలో 12 మంది అమ్మాయిలు పచ్చిబూతు డ్యాన్సులు (Video)
అమ్మవారి జాతరలకు ఆంధ్ర పల్లెల్లో అక్కడక్కడా రికార్డింగ్ డ్యాన్సులు మామూలే. ఐతే ఈ రికార్డింగ్ డ్యాన్సులు కొన్నిసార్లు శృతిమించిపోతుంటాయి. అలాంటి డ్యాన్సులు పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో జరిగాయి. పోలేరమ్మ జాతర సందర్భంగా గ్రామ ప్రజలు ఆనవాయితీగా ఈ రికార్డింగ్ డ్యాన్సులను ఎప్పటి నుంచో పరంపరగా కొనసాగిస్తూ వస్తున్నారు.
ఈ డ్యాన్సులను వేసిన 12 మంది అమ్మాయిల్లో కొంతమంది డ్యాన్సర్లు మరింత అశ్లీల నృత్యాలు చేసినట్లు పలువురు చెప్పుకుంటున్నారు. సమయం అర్థరాత్రి దాటాక ఈ యువతులు రెచ్చిపోయి అశ్లీల భంగిమలను చూపిస్తూ నృత్యం చేస్తుంటే యువత పిచ్చెక్కిపోతూ ఈలలు వేస్తూ గోలగోల చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.