బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 29 జులై 2020 (15:25 IST)

నాగార్జునసాగర్‌–శ్రీశైలం టైగర్‌ రిజర్వు ఫారెస్టులో 60 పులులు

3727.82 చ.కి.మీ.ల విస్తీర్ణంతో నాగార్జునసాగర్‌–శ్రీశైలం టైగర్‌ రిజర్వు ఫారెస్టు దేశంలోనే అతిపెద్దదని, ప్రపంచ వ్యాప్తంగా పులులు సంఖ్య నానాటికీ తగ్గిపోతున్నా మన రాష్ట్రంలో చేపడుతున్న సంరక్షణ చర్యల వల్ల పులులు సంఖ్య పెరిగిందని అటవీశాఖ అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

ప్రస్తుతం ఈ టైగర్‌ రిజర్వు ఫారెస్టులో 60 పులులు ఉన్నాయని... ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా పులులు సంఖ్య తగ్గుతున్నా మన రాష్ట్రంలో ఈ సంఖ్య పెరగిందన్నారు. పులుల రక్షణ అటవీ వన్యమృగాల సంరక్షణలో  నాగార్జునసాగర్ ‌–శ్రీశైలం రిజర్వు ఫారెస్టులో ఉన్న ఆదిమ చెంచు తెగలు వారు గొప్ప పాత్ర పోషిస్తున్నారని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. 
 
నాగార్జునసాగర్‌–శ్రీశైలం టైగర్‌ రిజర్వు నిర్వహణలో చెంచుల సహకారంతో సమర్ధవంతమైన మానవవనరుల నిర్వహణకు గాను భారత ప్రభుత్వం, నేషనల్‌ టైగర్‌ కన్సర్వేషన్‌ అథారిటీ వారు ఎక్సెలెన్స్‌ అవార్డును ప్రధానం చేశారని సీఎంకు వివరించారు.
 
ఈ సందర్భంగా అంతరించిపోతున్న పులుల జాతిని సంరక్షించడానికి అటవీ శాఖ అధికారులు తీసుకుంటున్న ప్రత్యేక కృషిని సీఎం వైఎస్‌ జగన్‌ అభినందించారు.
 
ఈ సమావేశంలో నీరబ్‌కుమార్‌ ప్రసాద్, (అటవీ, పర్యావరణ శాఖ స్పెషల్‌ సిఎస్‌) ఎన్‌. ప్రతీప్‌ కుమార్‌ (ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌), అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు