బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 15 అక్టోబరు 2018 (10:43 IST)

విగ్రహం పెడితే ప్రణయ్ ఆత్మ అందులోనే వుండిపోతుందా..?

అవును.. విగ్రహం పెడితే మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ ఆత్మ అందులోనే వుండిపోతుందని.. ప్రణయ్ ఆత్మ తమతో మాట్లాడుతోందని.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన పొత్తూరు నాగారావు, సత్యప్రియ దంపతులు చెప్ప

అవును.. విగ్రహం పెడితే మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ ఆత్మ అందులోనే వుండిపోతుందని.. ప్రణయ్ ఆత్మ తమతో మాట్లాడుతోందని.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన పొత్తూరు నాగారావు, సత్యప్రియ దంపతులు చెప్పారు. 
 
ప్రణయ్ ఆత్మతో మాట్లాడిస్తామని ప్రణయ్ భార్య అమృత వర్షిణిని నమ్మించే ప్రయత్నం చేశారు. వచ్చే జన్మలో కూడా ప్రణయ్ అమృతతోనే జీవించాలనుకుంటున్నట్లు తెలిపారు. కానీ అమృతకు వారిపై అనుమానం వచ్చింది. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాగరావు, సత్యప్రియ దంపతులు తమ పిల్లలతో కలిసి ఆదివారం ప్రణయ్‌ కుటుంబసభ్యులను పరామర్శించేందుకు మిర్యాలగూడకు వచ్చారు.
 
అమృతతో మాట్లాడాలని చెప్పి ఆమెను పిలిపించుకున్నారు. ప్రణయ్‌ ఆత్మ మాతో మాట్లాడుతోందని, మీతో కూడా మాట్లాడిస్తామని, నీ కోసం ఆయన ఆత్మ ఘోషిస్తూ మీ ఇంటిచుట్టే తిరుగుతోందని వారు అమృతకు వెల్లడించారు. మారుతీరావు, ప్రణయ్‌లు గత జన్మలో శత్రువులని, ఈ జన్మలో పగ తీర్చుకున్నారని తెలిపారు.
 
ప్రణయ్‌ విగ్రహం పెట్టకూడదని, విగ్రహం పెడితే అతడి ఆత్మ ఆ విగ్రహంలోనే ఉండిపోతుందని వారు అమృతకు చెప్పారు. దంపతుల ప్రవర్తనపై అనుమానంతో అమృత డీఎస్పీ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసింది. వన్‌టౌన్‌ సీఐ నాగరాజు ప్రణయ్‌ ఇంటివద్దకు చేరుకొని ఆ దంపతులిద్దరినీ అదుపులోకి తీసుకొన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నారు.