1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 8 మే 2021 (16:56 IST)

జనం కొడతారనే భయంతో జగన్ గారు నామ మాత్రపు బీమా తీసుకొచ్చారు: అబ్దుల్ అజీజ్

ప్రజలు రాళ్లతో కొడతారనే భయంతో, జగన్మోహన్ రెడ్డి గారు నామ మాత్రపు భీమా తీసుకుని వచ్చారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు నియోజకవర్గ ఇంచార్జ్ అబ్దుల్ అజీజ్.
 
ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ.... నిన్న నెల్లూరు రూరల్ మండలం గొల్ల కందుకూరు గ్రామంలో ట్రాక్టర్ ప్రమాదానికి గురై మృతి చెందిన ఐదుగురికి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోజూ వందల మంది చనిపోతున్నారని ఆ బాధలో నుంచి బయటకు రాకముందే మళ్ళీ ఈ విషాద ఘటన విని మనసు చలించిపోయింది అని అన్నారు.
 
నేను తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధినీ, నేను ఏమైనా మాట్లాడితే రాజకీయం అనుకుంటారని, కానీ ఈ పరిస్థితుల్లో మాట్లాడక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఘోరాతి ఘోరంగా పరిస్థితులు ఉన్నాయని, పట్ట పగలే చేయరాని పాపాలు చేస్తున్నారని వైసీపీ నాయకులపై మండిపడ్డారు.
 
గతంలో చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా తీసుకువచ్చారని పేద ప్రజలకు అండగా భిమా ఉపయోగపడిందని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆ బీమా తీసేశారని అన్నారు. జగన్ గారు కూడా బీమ తెచ్చారు కదా అని అంటారు ఈ నాయకులు. కానీ,  చంద్రన్న బీమాకి వైఎస్ఆర్ బీమా‌కి గల తేడాని నేను మీకు తెలియపరుస్తాను అని అన్నారు.
 
చంద్రన్న బీమా ఒక కుటుంబం మొత్తానికి అండగా ఉంటుంది అని, పేదల బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం చంద్రన్న భీమాను తీసుకు వచ్చారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారు తెచ్చిన వైయస్సార్ బీమా కేవలం ఒక మనిషికి మాత్రమే ఉపయోగపడుతుందని ఒక మనిషికి ఇన్సూరెన్స్ మాత్రమే ఉపయోగపడుతుందని అన్నారు.
 
ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనేదానికి నిన్న జరిగిన ప్రమాదమే ఉదాహరణ అని అన్నారు. నిన్న జరిగిన ప్రమాదంలో ఐదు మంది చనిపోయారని వారిలో కేవలం ఒక్కరికి మాత్రమే వైయస్సార్ బీమా వస్తుందని అంటే కేవలం 20 శాతం మంది ప్రజలకు మాత్రమే మీ బీమా వర్తిస్తుంది అని అన్నారు. అదే చంద్రన్న బీమా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి వర్తిస్తుంది అని అన్నారు.
 
నిన్న చనిపోయిన వారిలో కృష్ణవేణి అనే అమ్మాయికి అన్ఆఫీషియల్ డివోర్స్ అయిందని వాళ్ళ భర్త పేరు మీద బీమా ఉందని ఈమెకు బీమా రాదని, ఇప్పుడు అన్యాయం అయిపోయిన వారి బిడ్డ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.
 
చనిపోయిన వెంకటరమణమ్మ, అనే పాప వయస్సు 18 సంవత్సరాలు అని వారి తల్లిదండ్రులు విడిపోయారని బీమా ఆమె తల్లి పేరున ఉందని ఈ పాపకి ఎటువంటి సహాయం ప్రభుత్వం తరఫున అందదని అన్నారు. హైమావతి అనే ఆవిడ కూడా చనిపోయారని ఆమెకు కూడా బీమా ఆమె భర్త పేరున ఉందని ఈమెకు ఎటువంటి సహాయం అందదు అని అన్నారు.
 
మీరు ఇలా  కేవలం ఒకరి పేరుమీద భీమా ఇవ్వడం వల్ల వారి మీద ఆధారపడ్డ కుటుంబాలు అన్యాయం అయిపోయాయని అన్నారు. మీ ముఖ్యమంత్రిని అడిగి ఇస్తారా లేక సీఎం రిలీఫ్ ఫండ్ తరఫున ప్రత్యేక నిధులు తెప్పించి వారికి  న్యాయం చేస్తారా? అనేది తక్షణమే వివరించాలని డిమాండ్ చేశారు.