శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలోని 4 జిల్లాల్లో వర్షాలు

rain
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది వచ్చే రెండు రోజుల్లో తుఫానుగా మారే అవకాశం ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా, ఈ నెల 7, 8, 9 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాలకు వర్ష సూచన చేసింది. 
 
మరోవైపు, తూర్పు గాలుల ప్రభావంతో ఆదివారం కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని పలు చోట్ల వర్షాలు కురిశాయి. వచ్చే 24 గంటల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు పడుతాయని, ఉత్తర కోస్తాలో వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది. 
 
గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్ నుంచి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోందని, దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపారు. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఈ నెల 7వ తేదీన వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది.