గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: ఆదివారం, 24 అక్టోబరు 2021 (22:04 IST)

వైసిపి ప్రభుత్వంలో వింతపోకడలు కనిపిస్తున్నాయి: మాజీ మంత్రి అమరనాథరెడ్డి

వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత అమర్ నాథ్ రెడ్డి. రాష్ట్ర రాజకీయాల్లో వింత పోకడలు కనిపిస్తున్నాయన్నారు. గతంలో ఇలాంటి రాజకీయాలను ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్నారు.
 
ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియా ద్వారా టిడిపిపై దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. టిడిపి నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని.. అక్రమ కేసులను కార్యకర్తలపై పెడుతున్నారన్నారు. చిత్తూరులో టిడిపి నేత సందీప్ పైన అక్రమ కేసులు పెట్టారని..అరెస్టులకు భయపడమన్నారు.
 
పోలీసులు బెదిరింపులకు వెనక్కితగ్గమని.. ప్రజల కోసం  నిలబడతామన్నారు. ప్రతి నియోజకవర్గంలో టిడిపి కార్యకర్తల కోసం అడ్వకేట్లను పెడుతున్నామన్నారు. టిడిపి కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దన్నారు. ఎపిలో నిరుద్యోగులు, ఉద్యోగులు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని.. ప్రజలే జగన్ రెడ్డికి బుద్థిచెబుతారన్నారు.