శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 3 జూన్ 2024 (17:07 IST)

ఏపీ ఎన్నికల కౌంటింగ్: పలనాడులో భారీ డ్రోన్‌ను దించిన బలగాలు (video)

Drone
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4... అంటే రేపు ఉదయం ప్రారంభం కానున్నది. ఈ నేపధ్యంలో సమస్యాత్మక నియోజకవర్గాలపై ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లాలో ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం దాడి, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ రంగంలోకి డ్రోన్‌ను దింపాయి.
 
ఈ భారీ డ్రోన్‌ను పోలీసులు పరీక్షించారు. పిడుగురాళ్ల మండలం పరిధిలో వున్న కరలపాడు గ్రామంలో ఈ డ్రోన్‌ను దింపి అక్కడి నుంచి చుట్టుపక్కల ప్రాంతాలను దాని ద్వారా పరిశీలించారు. చూడండి ఈ వీడియోను...