రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం
వేసవి.. భానుడి వేడికి నానా తంటాలు పడిన ఏపీ ప్రజలకు శుభవార్త. రాబోయే మూడు రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ సూచనలను ఆ శాఖ విడుదల చేసింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో బుధవారం ఉరుములు, మెరుపులతో ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది.
గురువారం ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 30-40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అలాగే దక్షిణ కోస్తాంధ్రలో గురు,శుక్రవారాల్లో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.