సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 అక్టోబరు 2020 (14:31 IST)

టెండర్లు లేకుండానే రూ.కోట్లు "బూడిద గంతల్లో" పోస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నెల్లూరు జిల్లా దామోదరం సంజీవయ్య ధర్మల్ పవర్ ప్లాంట్‌లో బూడిదగుంత (యాష్‌ పాండ్‌) నిర్మాణానికి టెండర్లతో సంబంధం లేకుండా రూ.56.50 కోట్ల కాంట్రాక్టును ఎలా అప్పగించారని నిలదీసింది. 
 
టెండర్లు ఆహ్వానించకుండా నామినేషన్‌ ఆధారంగా కాంట్రాక్టు కట్టబెట్టడానికి వీల్లేదన్నారు. బాధ్యులైన అధికారులపై ప్రాథమికంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపట్టాలని, వచ్చేజనవరి 25లోపు నివేదిక సమర్పించాలని లోకాయుక్తను ఆదేశిస్తూ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
 
నెల్లూరు జిల్లా నేలటూరులోని ఈ పవర్‌ప్లాంట్‌లో నిబంధనలకు విరుద్ధంగా రెండో బూడిదగుంత నిర్మిస్తున్నారని, దీనిని నిలువరించాలని డి.రామసుబ్బారెడ్డి తదితరులు 2018 ఆగస్టులో హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరపున న్యాయవాది బొబ్బిలి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. విచారణను వారం వాయిదా వేయాలని పవర్‌ డెవల్‌పమెంట్‌ కంపెనీ లిమిటెడ్‌ తరపు న్యాయవాది ఒ.మనోహర్‌రెడ్డి అభ్యర్థించారు.