ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 డిశెంబరు 2022 (14:31 IST)

అన్నా మొబైల్ క్యాంటీన్.. రూ.2లకే మాంసాహార భోజనం

food
ఏపీలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మొబైల్ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు రెండు రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారు. ఈ మొబైల్ అన్నా క్యాంటీన్ ప్రారంభించి మంగళవారానికి 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రెండు రూపాయలకే మాంసాహార భోజనాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందించారు. ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.  
 
ఈ మొబైల్ అన్నా క్యాంటీన్ ఏర్పాటుచేసి 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రెండు రూపాయలకే మాంసాహార భోజనంతో పాటు కోడిగుడ్డు, స్వీటును కూడా అందించారు. ఈ కార్యక్రమాన్ని ఇకపై కొనసాగిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు మూసివేసిన సంగతి తెలిసిందే.