మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (08:24 IST)

పాల డెయిరీలో అక్రమాలు.. టీడీపీ నేత ధూళిపాళ్ళ అరెస్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై అధికార పార్టీనేతల కక్షసాధింపు చర్యలు కొనసాగుతూనే వున్నాయి. విపక్ష నేతలను నయానా భయానో అరెస్టు చేయించాలన్న ఏకైక లక్ష్యంతో పాలకులు ముందుకుసాగుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారలు అదుపులోకి తీసుకున్నారు. 
 
గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన నివాసం వద్ద ఈ తెల్లవారుజామునే భారీగా మోహరించిన పోలీసుల సమక్షంలో నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం నరేంద్రను అక్కడి నుంచి తమ వాహనంలో తీసుకెళ్లారు. 
 
ధూళిపాళ్ల ప్రస్తుతం సంగం డెయిరీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఆ సంస్థలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఆయనపై 408, 409, 418, 420, 465 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.