మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 జనవరి 2021 (17:16 IST)

ప్రవీణ్ చక్రవర్తి ఇంట్లో సీఐడీ పోలీసుల సోదాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న విగ్రహాల ధ్వంసం కేసులో అరెస్టు అయిన ప్రవీణ్ చక్రవర్తి నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఏపీ రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం కేసులో తాను కీలక పాత్ర పోషించినట్టుగా ప్రవీణ్ చక్రవర్తి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
 
ఏపీ రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, విధ్వంసాల కేసులో టీడీపీ, బీజేపీ నేతలను అరెస్ట్ చేసినట్టుగా ఏపీ డీజీపీ ప్రకటించిన రెండు రోజుల తర్వాత ప్రవీణ్ చక్రవర్తి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రవీణ్ చక్రవర్తి ఇంట్లో సీఐడీ సోదాలు నిర్వహించారు. 
 
ప్రవీణ్ చక్రవర్తి ఇంటితో పాటు ఆఫీసులో సీఐడీ అధికారులు సోదాలు చేశారు. ప్రవీణ్ చక్రవర్తి విషయంలో ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసుల విషయంలో విపక్షాలు ఏపీ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తున్నాయి.