శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 నవంబరు 2022 (12:24 IST)

అంతా ఆలోచించాం.. పరిపాలనా రాజధానిగా విశాఖ ఎంపిక.. సీఎం జగన్

ys jagan
అంతా ఆలోచించిన తర్వాతే విశాఖను పరిపాలనా రాజధానిగా ఎంపిక చేశామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో మూడు రాజధానుల వ్యవహారంపైన ఆయన తేల్చి చెప్పేసినట్లైంది. 
 
ఇలా చేస్తే సీఎం ఎక్కడి నుంచి అయినా పాలన చేయవచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ధిక అనుకూలత-పరిపాలనా సౌలభ్యం కోసమే విశాఖను పరిపాలనా రాజధానిగా ఎంపిక చేసామని వివరించారు.
 
ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం జగన్ తన అభిప్రాయాలను వివరించారు. సీఎం ఎక్కడ నుంచి పాలన చేస్తే అక్కడే సహచర మంత్రులు ఉంటారని.. అక్కడే సచివాలయం ఉంటుందని స్పష్టం చేశారు. 
 
వికేంద్రీకరణ స్పూర్తిగా విశాఖను పరిపాలనా రాజధానిగా ఎంచుకున్నామని చెప్పారు. 5 నుంచి 10 వేల కోట్లు ఖర్చు చేస్తే విశాఖ అద్భుత రాజధానిగా మారుతుందని జగన్ వెల్లడించారు.
 
అలాగే తనకు అమరావతి మీద ఎటువంటి కోపం లేదన్నారు జగన్. ఇష్టం లేకుంటే అమరావతిలో శాసన రాజధాని ఎందుకు ప్రకటిస్తామని, అక్కడే శాసన వ్యవస్థలు ఉంటాయని చెప్పారు. 
 
ఇక కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందని వెల్లడించారు. అమరావతి అటు గుంటూరు.. ఇటు విజయవాడకు 40 కిలో మీటర్ల దూరంలో ఉందని, అక్కడ ఎటువంటి మౌలిక వసతులు లేవని పేర్కొన్నారు.