మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , శనివారం, 18 సెప్టెంబరు 2021 (19:10 IST)

డాన్సింగ్‌ విత్‌ డ్రీమ్స్‌... విడుదల చేసిన సీఎం జగన్‌

ఆయ‌న ఓ సీనియ‌ర్ ఐ.ఎ.ఎస్., అంతే కాదు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాలో ఉన్నారు. నిత్యం స‌వాల‌క్ష ప‌నుల‌తో, స‌మావేశాల‌తో బిజీ బీజీగా ఉండే ఆయ‌న క‌విత‌లు కూడా రాశార‌ని తెలిసి, ఏపీ సీఎం షాక్ అయ్యారు. ఎంతో ఉత్సాహంగా ఆయ‌న రాసిన క‌విత‌ల సంక‌ల‌నాన్ని ఆవిష్క‌రించారు. 
 
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ రాసిన డాన్సింగ్‌ విత్‌ డ్రీమ్స్‌ కవితా సంకలనాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం విడుదల చేశారు. ఈ పుస్తకాన్నితాడేపల్లిలోని తన నివాసంలో సీఎం జగన్‌ విడుదల చేశారు. ఆదిత్యనాథ్‌ దాస్‌ సాహిత్యాభిమానాన్ని ప్రత్యేకంగా సీఎం అభినందించారు. ఈ సందర్భంగా తన కవితా సంకలనంలోని ఒక పెయింటింగ్‌ను సీఎంకు చీఫ్‌ సెక్రటరీ బహుకరించారు. ఈ కార్యక్రమంలో  పుస్తక ప్రచురణ కర్త రామ్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.