1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 ఫిబ్రవరి 2022 (10:40 IST)

విశాఖ ప్రజలకు చుక్కలుచూపిన ట్రాఫిక్ పోలీసులు.. సీఎం జగన్ ఆగ్రహం

తన విశాఖ పర్యటన సమయంలో స్థానిక ప్రజలకు, వాహనచోదకులకు, విమాన ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యానికి గురిచేసిన విశాఖ పోలీసులపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చేసే పనుల వల్ల తన ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందంటూ ఆయన పోలీస్ ఉన్నతాధికారులపై మండిపడ్డారు. 
 
కాగా, బుధవారం సీఎం జగన్ విశాఖలోని శారదాపీఠం దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా గంటలకొద్దీ ట్రాఫిక్‌ను నిలిపివేశారు. గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిపివేసి, దుకాణాలు మాయించి నరకం చూపించారు. గతంలో ఎన్నోసార్లు అనేకసార్లు సీఎం జగన్ విశాఖకు వచ్చారు. అపుడు కేవలం ఐదు పది నిమిషాలు మాత్రమే ట్రాఫిక్ నిలిపివేసేవారు. 
 
కానీ, ఈ దఫా ఏకంగా 2.30 గంటల మేరకు వాహనాలను నిలిపివేసి చుక్కలు చూపించారు. ట్రాఫిక్ పోలీసులు అతి చర్యల వల్ల విమాన ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. ముఖ్యంగా, ట్రాఫిక్ నిలిపివేయడంతో విమాన ప్రయాణికులు రెండు కిలోమీటర్ల మేరకు నడిచి విమానాశ్రాయానికి చేరుకోవాల్సి వచ్చింది. అలాగే, స్థానికులు తీవ్రంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వీరికష్టాలు మీడియాలో ప్రధాన శీర్షికలో రావడంతో సీఎం జగన్ పోలీసుల అధికారులపై మండిపడ్డారు.