సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (20:16 IST)

సినీ నటులు అలీ, పోసాని కృష్ణమురళికి త్వరలో పదవులు? (video)

Posani-Jagan
వైకాపాకు బలమైన మద్దతుదారులుగా ఉన్న సినీ నటులు అలీ, పోసాని కృష్ణమురళిలకు ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరలోనే కీలక బాధ్యతలను కట్టబెట్టనున్నారు. ఈ మేరకు ఆ పార్టీలోనూ, రాష్ట్రంలోనూ జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఇందులోభాగంగా, సినీ నటుడు అలీని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడుగా, పోసానిని ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించిన ఫైలు సీఎం చాంబరులో ఉందని, దానిపై ఆయన సంతకం చేయాల్సివుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. 
 
కాగా, అలీ విషయంలో గతంలో అనేక రకాలైన వార్తలు వచ్చాయి. అలీని రాజ్యసభకు పంపించనున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఆ సమయంలోనే అలీ సినీ నటుడు పవన్ కళ్యాణ్‌పై కూడా నోరు పారేసుకున్నారు. అదేవిధంగా పోసాని కృష్ణమురళి కూడా పదవి ఇవ్వనున్నట్టు పెద్దఎత్తున ప్రచారం జరిగింది.