ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 జూన్ 2022 (07:43 IST)

మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్

avanthi srinivas
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రి అవంతి శ్రీనివాస్‌కు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈయన భీమిలి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈయనకు కరోనా వైరస్ సోకినట్టు తేలడంతో ఆయన ఇంటిపట్టునే ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అవంతి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. 
 
గత 2019లో ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైకాపాలో చేరిన అవంతి వైకాపా టికెట్‌పై భీమిలి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైకాపా విజయం సాధించడంతో సీఎం జగన్ తన మంత్రివర్గంలో అవంతికి మంత్రిపదవిని కట్టబెట్టారు. అయితే, ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో అవంతి శ్రీనివాస్ మంత్రి పదవిని కోల్పోయారు.