1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (20:52 IST)

ఆదాయ వనరులు పెంచుకోవడంపై ఫోకస్ పెట్టిన ఏపీ

ఏపీ సర్కారు ఆదాయ వనరులు పెంచుకోవడంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఆదాయాన్ని ఆర్జించే శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఏపీ సీఎం  వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకురావడంలో కలెక్టర్లదే క్రియాశీలక పాత్ర అని స్పష్టం చేశారు. 
 
ఎస్‌ఓఆర్‌ పెంచుకోవడానికి ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి పద్ధతులు, విధానాలు పాటిస్తున్నారో పరిశీలించాలని ఏపీ సీఎం అన్నారు. వీటిని కార్యరూపంలోకి తీసుకు రావడంపై దృష్టి పెట్టాలన్నారు. 
 
పారదర్శక విధానాలను పాటిస్తూ ముందుకు సాగాలని.. రాబడులను పెంచుకునే క్రమంలో కచ్చితమైన ఎస్‌ఓపీలను పాటించాలని.. పెండింగ్‌లో ఉన్న వ్యాట్‌ కేసులను పరిష్కరించడం ద్వారా బకాయిలను రాబట్టుకోవడంపై దృష్టి సారించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.