1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (18:59 IST)

మేకపాటిపై నారాలోకేష్ సెటైర్లు-ఊకదంపుడు ఉపన్యాసం కోసం...

దుబాయ్ పర్యటనలో ఏపీకి భారీ పెట్టుబడులు తీసుకువస్తున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రకటించడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైర్లు వేశారు. 
 
ఖాళీ కుర్చీలకు ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వడానికి అబుదాబి వరకూ వెళ్లాలా మేకపాటి గౌతమ్ రెడ్డి గారూ అంటూ ఎద్దేవా చేశారు. పైగా జగన్ గురించి పెద్దగా ఇక్కడ ఎవరికి తెలియదని సెలవివ్వడం మేకపాటి గౌతమ్‌రెడ్డి స్పీచ్‌కే హైలెట్ అని లోకేష్ విమర్శలు చేశారు. 
 
అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పరువు గంగలో కలిసిపోయిందని లోకేష్ మండిపడ్డారు. కొత్త కంపెనీలు తెచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం మీకెలాగో చేతకాదు.. కనీసం ఉన్న కంపెనీలు పోకుండా చూడండి అదే పదివేలు అంటూ లోకేష్ హితవు పలికారు.