గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 డిశెంబరు 2022 (10:46 IST)

ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి వేతనం ఎందుకు జప్తు చేయరాదు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిత్యం హైకోర్టుతో చీవాట్లు తింటున్నారు. తాజాగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌ వైఖరిని తీవ్రంగా పరిగణించింది. పైగా, ఈయన నవంబరు నెల వేతనం ఎందుకు నిలిపి (జప్తు) వేయకూడదో చెప్పాలంటూ ప్రశ్నించింది. 
 
కరోనా సమయంలో వైద్య సేవల కోసం పలువురు వైద్యులను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకుంది. ఈ క్రమంలో వీరికి ప్రతి నెల చెల్లించాల్సిన వేతనాల్లో భాగంగా 2 నెలల వేతనాన్ని ప్రభుత్వం చెల్లించలేదు. 
 
ఈ వేతనాల కోసం వారు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన హైకోర్టు సర్కారు వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్‌కు చెందిన నవంబరు నెల వేతనాన్ని ఎందుకు జప్తు చేయకూడదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, ఈ పిటిషన్‌పై తదుపరి విచారణనను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది.