శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 సెప్టెంబరు 2022 (15:13 IST)

90 రోజుల్లో చార్జిషీటు దాఖలు చేయలేదన్న అనంతబాబు.. అయినా నో బెయిల్

anantha babu
తన వ్యక్తిగత కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. పోలీసులు 90 రోజుల్లో చార్జిషీటు దాఖలు చేయలేదన్న విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించినప్పటికీ కోర్టు మాత్రం అదేం పట్టించుకోకుండా ఆయనకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించడమేకాకుండా, పిటిషన్‌ను కూడా కొట్టివేసింది. 
 
ఏపీలో రాజకీయ దుమారం రేపిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణ ఖైదీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించింది. 
 
ఈ సందర్భంగా అనంతబాబు తరపు న్యాయవాది వాదిస్తూ, పోలీసులు నిర్ణీత 90 రోజుల్లో చార్జిషీటు దాఖలు చేయలేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నిబంధన ఆధారంగా తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషిన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు అనంతబాబుకు బెయిల్ మంజూరు చేయకుండా పిటిషన్‌ను కొట్టివేసింది.