గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 మార్చి 2022 (14:44 IST)

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టిక్కెట్ల విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టిక్కెట్లు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి మే 12వ తేదీ వరకూ జరగనున్నాయి. ఏప్రిల్ 7 నుంచి ప్రారంభం కావల్సిన పరీక్షలు.. జేఈఈ మెయిన్స్ పరీక్ష తేదీల కారణంగా వాయిదా పడ్డాయి. 
 
మరో రెండ్రోజుల్లో అంటే మార్చ్ 11 నుంచి ఇంటర్నీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తాజాగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లను ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ విడుదల చేసింది. ఈ హాల్ టికెట్లను చాలా సులభంగా ఇంట్లోనే కూర్చుని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
 
ఇందుకోసం ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ https://bie.ap.gov.in/ ద్వారా పొందవచ్చు.  ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు జరిగే మెయిన్ పరీక్షల హాల్ టికెట్లు వేరుగా ఉంటాయి. అవి త్వరలో విడుదల కానున్నాయి. ఇవి కూడా ఇదే వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు.