నేడు ఏపీలో కానిస్టేబుల్ భర్తీ ప్రిలిమినరీ పరీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జరుగనుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 6100 కానిస్టేబుల్ పోస్టులకు మొత్తం 5.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికో 997 కేంద్రాల్లో రాత పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్షను ఆదివారం ఉదయం 10 గంటలకు మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రానికి ఉదయం 9 గంటలకే చేరుకోవాల్సివుంది. పది గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.
పరీక్షా హాలులోకి ఫోన్లు, ట్యాబ్‌లు, పెన్ డ్రైవ్‌లు, బ్లూటూత్‌లు, రికార్డింగ్ పరికరాలు, క్యాలిక్యులేటర్, పర్సు, పేపర్లు, ఇతర ఎలక్ట్రానికి పరికరాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. అభ్యర్థులు హాల్ టిక్కెట్, బ్లూ, బ్లాక్ బాల్‌పాయింట్ పెన్నులు మాత్రమే తీసుకుని రావాలని సూచించింది. అలాగే, ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు కార్డు, రేషన్ కార్డు వంటివివి ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డును తమ వెటం తీసుకుని రావాలని సూచించింది.