గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 జనవరి 2023 (18:15 IST)

ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమనరీ పరీక్ష.. ఒక్క నిమిషం దాటినా?

ఏపీలో ఆదివారం పరీక్షలు జరుగనున్నాయి. ఏపీలో పోలీస్ కావాలనే నిరుద్యోగుల కలలు నిజం కానున్నాయి. పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమనరీ పరీక్షకు సర్వం సిద్ధమైంది. పోలిస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రిలిమనరీ రాత పరీక్ష నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాటు చేశారు. 
 
ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్లు పరీక్షల నిర్వహణ కేంద్రాలను ఇప్పటికే సందర్శించారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా సీసీ కెమెరాలను పరిశీలించారు. 
 
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష వుంటుంది. అభ్యర్థులు తొమ్మిది గంటల నుంచే పరీక్ష సెంటర్ లోకి అనుమతివ్వనున్నట్లు ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది. ఉదయం 10 గంటల తర్వాత ఒక్కనిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతించరు.