1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2022 (15:52 IST)

అక్కడ మూడు రోజుల పాటు మద్యం షాపులు బంద్

liquor sale
ఢిల్లీలో మూడు రోజుల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పాటు లిక్కర్ విక్రయాలు బంద్ కానున్నాయి. ఈ నెల 4వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్నాయి. 
 
ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో శుక్రవారం సాయంత్రం 5.30 గంటల నుంచి డిసెంబరు 4వ తేదీన సాయంత్రం 5.30 గంటల వరకు మద్యం షాపులతో పాటు వాటి అనుబంధ బార్లు, సేల్ ఔట్‌లెట్స్‌లు మూతపడనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను జారీచేసింది. 
 
ఈ మూడు రోజుల పాటు అనధికారికంగా ఎవరూ మద్యంను నిల్వ చేయడం లేదా తరలించడంగానీ చేయకుండా పోలీసులు ఎక్సైజ్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 7వ తేదీన జరుగనుంది.