శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 డిశెంబరు 2022 (13:04 IST)

గ్రూపు -1 ప్రిలిమినరీ పరీక్ష తేదాని వెల్లడించిన ఏపీపీఎస్సీ

appsc exam
గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పరీక్షల నిర్వహణ తేదీని వెల్లడించింది. జనవరి 8వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి పేపరు పరీక్షను నిర్వహించనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. అలాగే, రెండో పేపరును మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారు. 
 
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న మొత్తం 92 గ్రూపు-1 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే గడువు నవంబరు 5వ తేదీతోనే ముగియగా, వచ్చే నెల 8వ తేదీన ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్నారు. 
 
అయితే, ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అడ్మిట్ కార్డుల(హాల్ టిక్కెట్లు)ను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ నెల 31వ తేదీ నుంచి హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 18 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు.