ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2022 (22:25 IST)

కందుకూరు తొక్కిసలాట.. టీడీపీ రూ.24 లక్షల ఎక్స్‌గ్రేషియా

chandrababu
కందుకూరు తొక్కిసలాట మృతుల కుటుంబాలకు టీడీపీ రూ.24 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. బుధవారం రాత్రి కందుకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు చేపట్టిన రోడ్‌షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన ఎనిమిది మంది వ్యక్తుల బంధువులకు ఒక్కొక్కరికి రూ.24 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది టీడీపీ. 
 
మృతుల కుటుంబాలకు తొలుత రూ.10 లక్షలు ప్రకటించిన టీడీపీ.. గురువారం అదే రూ.15 లక్షలకు పెంచింది. మృతుల బంధువులకు 11మంది నేతలు మరో రూ.9 లక్షలు ప్రకటించారు.
 
నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో బుధవారం రాత్రి మాజీ ముఖ్యమంత్రి రోడ్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు సహా వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతిపక్ష నేతను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం ముందుకు వచ్చి కాలువలో పడిపోవడంతో జరిగిన ఈ విషాదంలో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. 
 
ఈ నేపథ్యంలో గురువారం టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలను ఓదార్చారు. కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ తరపున ఎక్స్ గ్రేషియా చెక్కులను అందజేశారు.