శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 డిశెంబరు 2021 (07:58 IST)

కడప జిల్లాలో ఏఆర్ ఎస్ఐ చంద్రారావు ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో పని చేస్తున్న ఎస్ఐ ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈయన పేరు చంద్రారావు. కడపలో ఏఆర్ విభాగంలో పని చేస్తున్నారు. ఈయన సొంతూరు శ్రీకాకుళం. కడపలో విధులు నిర్వహిస్తూ ఒంటరిగానే నివసిస్తున్నారు.
 
ఈ క్రమంలో 25 యేళ్ల చంద్రారావు ఆత్మహత్య చేసుకున్న సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. పోస్టుమార్టం కోసం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. 
 
కేసు నమోదు చేసి చేపట్టిన ప్రాథమిక విచారణలో కుటుంబ సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. అయితే, కుటుంబ సభ్యులు మాత్రం పని ఒత్తిడి కారణంగానే ఈ ఘోరానికి పాల్పడివుంటారని అంటున్నారు.