గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 డిశెంబరు 2021 (16:19 IST)

వెస్ట్ గోదావరి జిల్లాలో కరోనా కలకలం - ఒమిక్రాన్ తొలి కేసు

వెస్ట్ గోదావరి జిల్లాలో ఒమిక్రాన్ వైరస్ కలకలం సృష్టిచింది. ఈ జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈ నెల 21వ తేదీన ఏలూరు రూరల్ పత్తికోళ్ళ లంకలో కువైట్ నుంచి వచ్చిన 41 యేళ్ల మహిళకు ఒమిక్రాన్ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా వెల్లడించారు. ఇదే జిల్లాలో నమోదైన తొలి ఒమిక్రాన్ కేసు అని చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పారు. 
 
కాగా, నెల 45 రోజుల్లో జిల్లాకు 6,856 మంది విదేశాల నుంచి వచ్చారని తెలిపారు. వీరికి ఎయిర్‌పోర్టులోనే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసిన తర్వాతే సొంతూర్లకు అనుమతిస్తున్నట్టు చెప్పారు. వీరిలో 14 మంది కోవిడ్ పాజిటివ్ అని తేలిందని చెప్పారు. 
 
విదేశాల నుంచి వచ్చిన వారిలో 4,200 మందికి 8 రోజుల తర్వాత టెస్టులు చేయగా, ప్రైమరీ కాంటాక్ట్స్ నెగెటివ్ అని ఫలితం వచ్చిందన్నారు. అలాగే, మరో 2,600 మంది 8 రోజుల వ్యవధిలో ఉన్నారనీ వీరికి కూడా నిర్ధారణ పరీక్షలు చేయాల్సివుందన్నారు.