మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 24 జూన్ 2018 (16:21 IST)

చంద్రబాబుకు నిజాలు.. మాకు అబద్ధాలు చెప్పడం రాదు : కన్నా లక్ష్మీనారాయణ

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు నిజాలు, మాకు అబద్ధాలు చెప్పడం రాదని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన ఆదివారం రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడుతూ, పోలవరం ప

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు నిజాలు, మాకు అబద్ధాలు చెప్పడం రాదని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన ఆదివారం రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్ కు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రతి పైసా కేంద్రం ఇచ్చిందేనని అన్నారు.
 
పోలవరంపై చంద్రబాబు చెబుతున్నవన్నీ అవాస్తవాలేనన్నారు. అందుకే చంద్రబాబుకు నిజం మాట్లాడటం, తమకు అబద్ధాలు చెప్పడం చేతకాదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీలో తెలుగుదేశం, వైసీపీ కుమ్మక్కై సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని అన్నారు. 
 
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని మోడీ ఇచ్చిన వరం పోలవరం ప్రాజెక్టు అని ఆయన వ్యాఖ్యానించారు. పోలవరం ఆంధ్రా ప్రజల దీర్ఘకాలిక స్వప్నం, రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి పోలవరం జీవనాడి అనే విషయం ప్రతిఒక్కరికీ తెలుసని అన్నారు.