మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 24 జూన్ 2018 (15:07 IST)

రేణూ దేశాయ్‌కు నిశ్చితార్థం.. ఫోటో వైరల్

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌ రెండో పెళ్లి చేసుకోనున్నారు. ఇందులోభాగంగా, ఆమెకు ఆదివారం నిశ్చితార్థం జరిగినట్టు వార్తలు గుప్పుమన్నాయి. వీటిని నిజం చేసేలా ఓ నిశ్చితార్థం

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌ రెండో పెళ్లి చేసుకోనున్నారు. ఇందులోభాగంగా, ఆమెకు ఆదివారం నిశ్చితార్థం జరిగినట్టు వార్తలు గుప్పుమన్నాయి. వీటిని నిజం చేసేలా ఓ నిశ్చితార్థం ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
తనకు కాబోయే జీవిత భాగస్వామి చేతిపై రేణూ చెయ్యేసిన ఫొటోలో నిశ్చితార్థపు ఉంగరాలు గమనించవచ్చు. జీవిత భాగస్వామి ఎవరు, ఏంటి అన్న వివరాలపై స్పష్టత ఇ‍వ్వకపోయినా.. ఎంగేజ్‌మెంట్‌ జరిగిన విషయాన్ని మాత్రం తన పోస్ట్‌తో వెల్లడించేశారు. ఈ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అది వైరల్‌ అవుతోంది. ఆ మధ్య రెండో వివాహం గురించి మాట్లాడిన రేణూ.. తాజాగా ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో తెలిపారు. 
 
కాగా, రేణూ దేశాయ్‌కు విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఆమెకు పిల్లలు కూడా. దీంతో రేణూ కూడా రెండో పెళ్లికి మొగ్గు చూపింది. 'జీవిత భాగస్వామి కోసం వెతికితే తప్పేంటి. పిల్లల్ని చూసుకోవడానికి నాకు ఓ తోడు అవసరం' అని పేర్కొంది. పైగా, ఇటీవల తన రెండో వివాహ ఆలోచనలను షేర్‌ చేసుకున్న విషయం తెల్సిందే.