శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 22 నవంబరు 2018 (13:35 IST)

బీజేపీకి షాక్.. సైకిలెక్కనున్న విష్ణుకుమార్ రాజు?

భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు తేరుకోలేని షాకివ్వనున్నారు. ప్రస్తుతం ఈయన ఎమ్మెల్యేగా, శాసనభాపక్ష నేతగా ఉన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. దీంతో అనేక మంది బీజేపీ నేతలు తమ రాజకీయ భవితవ్యంపై ఆందోళన చెందుతున్నారు. 
 
ఇలాంటివారిలో విష్ణుకుమార్ రాజు ఒకరు. ఈయన పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే అంశంపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ఆయనకు ఆహ్వానం అందుతుందని ఆయన స్నేహితులు చెబుతున్నారు. 
 
అయితే, ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా, బీజేపీ శాసనసభపక్ష నేతగా ఉన్నందున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారు.