వైకాపా ఓడినపుడు వచ్చిన చావు పేరేంటో? బీజేపీ నేత సత్యకుమార్ ప్రశ్న
కర్నాటక అసెంబ్లీకి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఈ ఓటమిని వైకాపా నేతలు చావు దెబ్బగా అభివర్ణిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమిని కుక్క చావుగా మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ ఓడినప్పుడు వచ్చిన చావు పేరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
విశాఖ ఎంపీ స్థానంలో బీజేపీ కార్యకర్త చేతిలో వైఎస్ విజయలక్ష్మి ఓడిపోయిన తీరును ఏమంటారో కూడా చెప్పాలన్నారు. ఆదివారం విశాఖలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో సత్యకుమార్ మాట్లాడుతూ.. వైసీపీ పాలనతో రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని ఆరోపించారు. కర్ణాటకలో బీజేపీది కుక్కచావు. అయితే... కడపలో వార్డు మెంబర్ ఓడిన రాజారెడ్డిది. రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లినప్పుడు దక్కిన ఘోర పరాభవాన్ని ఏమంటారో కూడా పేర్ని నాని చెప్పాలన్నారు. ఒక్కసారి గెలిచినంత మాత్రాన అంత మిడిసిపాటు తగదని హితవు పలికారు.