ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (12:59 IST)

నెల్లూరు రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు... పోలీసుల అప్రమత్తం

nellore station
జిల్లా కేంద్రమైన నెల్లూరులోని రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ఎవరో ఫోన్ చేసి బాంబు పెట్టినట్టు హెచ్చరించాడు. దీంతో రైల్వే స్టేషన్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఒకటో నంబరు ఫ్లాట్‌ఫాంపై బాంబు పెట్టామని, అది మరికొద్దిసేపట్లో పేలుతుదంటూ 112 నెంబరుకు ఫోన్ చేసి హెచ్చరించాడు. ఈ విషయాన్ని రైల్వేసిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. 
 
దీంతో అప్రమత్తమైన పోలీసులు... బాంబు తనిఖీ బృందాలు, పోలీసు జాగిలాలతో స్టేషన్‌ను జల్లెడ పట్టారు. ప్రయాణికులను రైల్వే స్టేషన్ నుంచి దూరంగా పంపించి పార్శిల్ కేంద్రం, బ్యాగులను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఎక్కడా బాంబు పెట్టినట్టు ఆనవాళ్ళు లేకపోవడంతో అకతాయి పనిగా తేల్చారు. దీంతో ప్రయాణికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అకతాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు.