బస్సు నడుపుతుండగా గుండెపోటు, 50 మందిని కాపాడి స్టీరింగ్ పైన కూలిపోయాడు
బస్సు నడుపుతూ వుండగా డ్రైవరు గుండెపోటుకి గురయ్యాడు. తనకు గుండెపోటు వచ్చిందని గమనించిన సదరు డ్రైవరు వెంటనే బస్సు వేగాన్ని తగ్గించాడు. రోడ్డు పక్కనే నిలిపివేసి స్ట్రీరింగ్ పైన తల వాల్చాడు. ఆ సమయంలో బస్సులో 50 మంది విద్యార్థులున్నారు. డ్రైవర్ అలా పక్కనే ఆపడంతో ఏమైందో తెలియకు దగ్గరకు వచ్చి చూడగా అప్పటికే ఆయన మృతి చెందాడు.
పూర్తి వివరాలు చూస్తే.... డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన డి. నారాయణరాజు రాజమహేంద్రవరం డైట్ ఇంజినీరింగ్ కళాశాల బస్సు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. కళాశాల బస్సును కొత్తపేట మండలం గంటి నుంచి విద్యార్థులను ఎక్కించుకుని వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆయన బస్సు నడుపుతుండగా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. తనకు గుండెల్లో భారంగా అనిపించడంతో బస్సును రోడ్డు పక్కనే ఆపేసి స్టీరింగ్ పైనే కుప్పకూలాడు. ఆవిధంగా 50 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడాడు.