బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శుక్రవారం, 9 జులై 2021 (19:16 IST)

ఒక‌టి కొంటే రెండు ఫ్రీ, ఆప్కో చీరల ఆఫ‌ర్లు

ప్ర‌యివేటు బట్ట‌ల దుకాణాల‌తో పోటీ ప‌డుతూ, ఆప్కో కూడా స‌రికొత్త ఆఫ‌ర్ల‌ను ఆరంభించింది. చీర ఒక‌టి కొంటే మ‌రొక‌టి ఫ్రీ... అలాగే, ఒక‌టి కొంటే రెండు ఫ్రీ అంటూ ఆఫ‌ర్ల మోత మోగిస్తోంది.

ఆషాఢ మాసం సంద‌ర్భంగా ఆప్కో అన్ని షోరూం ల‌లో 30 శాతం డిస్కౌంట్లు ఇస్తున్నామ‌ని ఆప్కో డిఎంఓ ప్ర‌సాద‌రెడ్డి తెలిపారు. చేనేత వ‌స్త్రాల‌ను వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి తెచ్చేందుకు, నేత కార్మికుల‌ను ఆదుకునేందుకు ఈ ఆఫ‌ర్ల‌ను పెట్టామ‌న్నారు.

కృష్ణా, గుంటూరు, ప్ర‌కాశం జిల్లాల‌లోని ఆప్కో షోరూం ల‌లో 30 శాతం రిబేటుతోపాటు ఒక‌టి కొంటే ఒక‌టి, రెండు ఫ్రీ ఆఫ‌ర్లు కూడా ఇస్తున్నామ‌న్నారు.ధ‌ర్మ‌వ‌రం, వెంక‌ట‌గిరి, ఉప్పాడ‌, మంగ‌ళగిరి చేనేత వ‌స్త్రాల‌పై ఈ రాయితీలు ఇస్తున్న‌ట్లు విజ‌య‌వాడ ఆప్కో మెగా షోరూం మేనేజ‌రు గోపాల కృష్ణ పేర్కొన్నారు.