సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 30 డిశెంబరు 2020 (21:28 IST)

భయపడుతూ బతకలేము.. నారా లోకేష్‌

కడప జిల్లాలో పర్యటించారు తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్సి నారా లోకేష్‌. వైసిపి కార్యకర్తల చేతిలో దారుణంగా హత్యకు గురైన నందం సుబ్బయ్య పార్థీవదేహానికి నివాళులు అర్పించారు నారా లోకేష్‌. సుబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తరువాత జరిగిన మీడియా సమావేశంలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు నారా లోకేష్‌.
 
ఆంధ్రప్రదేశ్‌ హత్యాంధ్రప్రదేశ్‌గా మారిపోతోందంటూ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజురోజుకు క్షీణించిపోయాయి. పోలీసులు వైసిపి కార్యకర్తల్లా మారిపోయారు. వైసిపికి వారు బానిసలైపోయారు. ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు.
 
అంతేకాదు అతి దారుణంగా టిడిపి కార్యకర్తను చంపేస్తే తూతూ మంత్రంగా కేసులు పెడతారా. అసలు మీరేం చేస్తున్నారు. వైసిపి ఎమ్మెల్యే కూడా ఇందులో ప్రధాన ముద్దాయి. అతన్ని వదిలేస్తారా? వెంటనే వారిపై కేసులు పెట్టండి అంటూ మండిపడ్డారు నారా లోకేష్‌.