ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 జులై 2022 (12:56 IST)

మిక్కీ మౌస్, టెడ్డీ బేర్ వేషధారణ‌లో ప్రాంక్ వీడియో.. కేసు నమోదు

Teddy
Teddy
సిటీల్లో ప్రస్తుతం బోల్డ్ ప్రాంక్స్ తంతు ఎక్కువైపోయింది. ప్రశాంతంగా ఉన్న ప్రాంతాన్ని ప్రాంక్ వీడియోలతో రచ్చలేపుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఓ యువకుడు చేసిన ప్రాంక్ వీడియో ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
 
వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా గుడియాత్తం కాలేజీ రోడ్డులో మిక్కీ మౌస్, టెడ్డీ బేర్ వేషధారణలో సయ్యద్ కరీముల్లా(21) అనే యువకుడు ప్రాంక్ వీడియో చేయాలనుకున్నాడు. అటుగా వెళ్తున్న మహిళలు, విద్యార్థినులతో ప్రాంక్ చేయడం మొదలుపెట్టాడు. 
 
అమ్మాయిల చెయ్యి పట్టుకుని లాగడం, చిన్న పిల్లలను భయపెట్టడం.. వారి వెంటపడటం.. వింత వింత సైగలు చేయడం లాంటివి చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. 
 
దీనితో వారి ప్రవర్తనకు విసిగిపోయిన కొందరు మహిళలు.. పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన వారు.. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కరీముల్లాను అరెస్ట్ చేశారు.