1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 21 ఆగస్టు 2020 (11:31 IST)

ఏపీకి కేంద్రం అవార్డులు

ఏపీలోని సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థతో దేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ సత్తా చాటుతోంది. నేరుగా ప్రజల వద్దకే అన్ని సేవలు చేరువ చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ రాష్ట్ర ప్రగతిలో కీలక భూమిక పోషిస్తోంది.

కేంద్రం తాజాగా ప్రకటించిన స్వచ్చ సర్వేక్షణ్‌ అవార్డుల్లో రికార్డు స్థాయిలో ఏపీకి పురస్కారాలు దక్కాయి. సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థతో పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడింది. దీంతో స్వచ్చ సర్వేక్షణ్‌ అవార్డుల్లో అత్యధిక పురస్కారాలు ఏపీకి దక్కాయి. 

పరిశుభ్రత విషయంలో రాష్ట్ర ర్యాంక్‌ గణనీయంగా మెరుగుపడి 28వ ర్యాంక్‌ నుండి 6వ స్థానానికి చేరుకుంది. కేంద్రం ప్రకటించిన మొత్తం 64 అవార్డుల్లో 6 అవార్డులు రాష్ట్రానికే రావడం విశేషం. టాప్ 100 ర్యాంకుల్లో  72 ర్యాంకులు ఆంధ్రప్రదేశ్ పట్టణాలు కైవసం చేసుకున్నాయి.

టాప్ 10లో ఎనిమిది మున్సిపాలిటీలు రాష్ట్రానివే ఉన్నాయి. విశాఖపట్నం 23 ర్యాంక్‌ నుంచి 9వ ర్యాంక్‌కు ఎగబాకింది. విజయవాడ 12 నుంచి 4వ ర్యాంక్‌కి, తిరుపతి 8 నుంచి 6వ స్థానానికి చేరుకున్నాయి.