గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 అక్టోబరు 2023 (09:25 IST)

స్కిల్ స్కామ్ కేసులో నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్

chandrababu
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ గురువారంతో ముగియనుంది. దీంతో ఆయనను వర్చువల్‌గానే విజయవాడలోని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వద్ద హాజరుపరిచే అవకాశం ఉంది. 
 
అయితే, ఈ విషయాన్ని జైలు పర్యవేక్షణాధికారి రాహుల్‌ వద్ద ప్రస్తావించగా తమకు ఇప్పటివరకు ఎటువంటి ఆదేశాలు రాలేదన్నారు. సూచనలు వస్తే ఏర్పాట్లు చేస్తామన్నారు. మొదటి రిమాండ్‌ ముగిసిన తర్వాత చంద్రబాబు న్యాయమూర్తి ఎదుట వర్చువల్‌లో హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. 
 
అప్పుడు రెండు రోజులు సీఐడీ కస్టడీకి అనుమతించడంతో జైలులోనే అధికారులు విచారించారు. ఆ తర్వాత కూడా వర్చువల్‌లోనే న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా అక్టోబరు 5 వరకు రిమాండ్‌ విధించారు. ఇది నేటితో ముగియనుండటంతో చంద్రబాబును మళ్లీ కోర్టులో హాజరుపరిచాల్సివుంది. ఇపుడు ఆయన్ను నేరుగా కోర్టుకు తీసుకొస్తారా లేక వర్చువల్‌గా హాజరుపరుస్తారా అనే విషయం తేలాల్సివుంది.