శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 నవంబరు 2023 (13:17 IST)

తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం.. మారుతీ షోరూమ్‌లోకి..?

Cheddi gang
Cheddi gang
తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపింది. శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత నగరంలో చెడ్డీగ్యాంగ్‌ హల్‌చల్‌ చేశారు. తిరుపతి - రేణిగుంట మార్గంలోని మారుతీ సుజుకి షోరూమ్‌లో చోరీకి యత్నించారు.
 
ముగ్గురు దొంగలు షోరూమ్‌ వెనుక వైపు తలుపు పగులగొట్టి షోరూమ్‌లోకి చొరబడ్డారు. రాడ్లు, ఆయుధాలు చేతపట్టుకుని షోరూమ్‌ అంతటా గాలించారు. 
 
ఈ దృశ్యాలు షోరూమ్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఐతే షోరూమ్‌లో విలువైనవేవీ దొరకకపోవడంతో చెడ్డీగ్యాంగ్‌ వెనుదిరిగింది. 
 
తిరుపతి అలిపిరి పోలీసులు చెడ్డీగ్యాంగ్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తిరుపతిలోని పోలీస్‌ స్టేషన్లు, అధికారులనే కాకుండా జిల్లా పోలీసులను, ప్రజలను అప్రమత్తం చేశారు.